మీ సహనానికి థాంక్స్: అఖిల్ | thank your for your patience, tweets akhil akkineni | Sakshi
Sakshi News home page

మీ సహనానికి థాంక్స్: అఖిల్

Oct 24 2015 4:01 PM | Updated on Sep 3 2017 11:25 AM

మీ సహనానికి థాంక్స్: అఖిల్

మీ సహనానికి థాంక్స్: అఖిల్

సినిమా విడుదల ఆలస్యం కావడంతో కాస్త ఇబ్బంది పడినా, ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడూ తన సినిమా గురించి అప్‌డేట్లు ఇస్తూ.. సినిమా గురించిన చర్చ జనం నోళ్లలో నానేలా చూసుకుంటున్నాడు అఖిల్.

తొలిసారి హీరోగా నటిస్తుంటే ఎవరికైనా చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. అందులోనూ ముందు నుంచి అంచనాలు చాలా ఎక్కువగా ఉండే అక్కినేని వంశ వారసుడు అఖిల్ లాంటివాళ్లకు అయితే ఇది మరింత ఎక్కువ. అనుకున్న సమయం కంటే సినిమా విడుదల ఆలస్యం కావడంతో కాస్త ఇబ్బంది పడినా, ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడూ తన సినిమా గురించి అప్‌డేట్లు ఇస్తూ.. సినిమా గురించిన చర్చ జనం నోళ్లలో నానేలా చూసుకుంటున్నాడు అఖిల్.

తాజాగా సినిమా పనుల గురించి ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు వివరించాడు. అఖిల్ సినిమా పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్క విషయంలోనూ కచ్చితత్వాన్ని తీసుకొస్తున్నామని తెలిపాడు. అలాగే ప్రేక్షకుల సహనానికి థాంక్స్ కూడా చెప్పాడు. మరిన్ని వివరాలతో త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానంటూ ట్వీట్ చేశాడు అక్కినేని బుల్లోడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement