
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగా పవర్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సౌత్ టాప్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ రోజు (ఆదివారం) నయనతార పుట్టిన రోజు సందర్భంగా సైరా టీం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో నయన్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
సినిమాలోని ఆమె పాత్ర పేరును సిద్ధమ్మగా పరిచయం చేసిన సైరా, లుక్‌ను కూడా రివీల్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2019 సమ్మర్‌లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కురెడీ అవుతున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.