పాకిస్థాన్‌ నటికి గట్టి కౌంటర్‌ | Swara Bhasker Gives A Befitting Reply Veena Malik | Sakshi
Sakshi News home page

పాక్‌ నటికి గట్టి సమాధానం

Feb 28 2019 5:27 PM | Updated on Feb 28 2019 5:42 PM

Swara Bhasker Gives A Befitting Reply Veena Malik - Sakshi

వీణా మాలిక్‌, స్వర భాస్కర్‌

వీణా మాలిక్‌​ కామెంట్లపై బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ దీటుగా స్పందించారు.

ముంబై: భారత్‌- పాకిస్థాన్‌ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల నాయకులతో పాటు సెలబ్రిటీల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది. పాకిస్థాన్‌ నటి వీణా మాలిక్‌ తమ దేశ సైన్యాన్ని పొడుగుతూ, భారత్‌ ఆర్మీని విమర్శిస్తూ ట్విటర్‌లో కామెంట్లు, ఫొటోలు పెట్టారు. పాక్ ఆర్మీ బందీగా పట్టుకున్న భారత పైలట్‌ అభినందన్‌ను వెక్కిరిస్తూ తాజాగా వ్యాఖ్యలు చేశారు. (తలొగ్గిన పాక్‌.. రేపు అభినందన్‌ విడుదల)

వీణా మాలిక్‌​ కామెంట్లపై బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ దీటుగా స్పందించారు. ‘వీణాజీ.. దుర్బలమైన మీ మనస్తత్వం చూసి సిగ్గుపడుతున్నాం. మీ ఆనందం ఎక్కువసేపు నిలవదు. మా పైలట్‌ రియల్‌ హీరో. చాలా ధైర్యవంతుడు, సమర్థవంతుడు. కారాగారాన్ని కూడా హుందాగా స్వీకరించారు. వింగ్‌ కమాండర్ అభినందన్‌ను ప్రశ్నించిన పాకిస్థాన్‌ ఆర్మీ మేజర్‌ చూపిన సభ్యత కూడా మీరు చూపలేకపోయార’ని వీణా మాలిక్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ మెరుపు దాడుల నేపథ్యంలో స్పందించిన బాలీవుడ్‌ నటులపై కూడా అంతకుముందు వీణా మాలిక్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘తేరె ప్యార్‌ మైన్‌’ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేసిన వీణా మాలిక్‌ పలు హిందీ సినిమాల్లో నటించారు. హిందీ రియాల్టి షో బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పోటీ పడ్డారు. ‘నగ్నసత్యం’ అనే తెలుగు సినిమాలోనూ నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement