‘నా పేరు నందగోపాలకృష్ణ. నన్ను ఎన్‌జీకే అని పిలుస్తారు’

Surya NGK Teaser Released - Sakshi

'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సూర్య,  '7\జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో రీసెంట్‌గా 'ఖాకి' వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు 'డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌', 'రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్ ల పై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'ఎన్‌జీకే' (నంద గోపాల కృష్ణ). ఈ చిత్ర టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. 

‘నా పేరు నంద గోపాల కృష్ణ. ప్రజలు నన్ను ఎన్జికె అని పిలుస్తారు’ అని సూర్య చెప్పే డైలాగ్ తో మొదలయ్యే టీజర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠ రేపేలా ఉంది. సాయి పల్లవి చెప్పే ‘గోపాలా పోరా నాన్నా నువ్వెళ్తే ఎలాంటి మురికైనా శుభ్రమవుతుంది’ అనే డైలాగ్‌తో ‘ఎన్‌జీకే’  హై ఓల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ గా అలరించనుంది. సూర్య తో జంటగా  సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top