టైమింగ్.. టేకింగ్ కుదిరాయి | Sunil's Jakkanna Movie is all set for its release on 29th July | Sakshi
Sakshi News home page

టైమింగ్.. టేకింగ్ కుదిరాయి

Jul 15 2016 11:35 PM | Updated on Sep 4 2017 4:56 AM

టైమింగ్.. టేకింగ్ కుదిరాయి

టైమింగ్.. టేకింగ్ కుదిరాయి

తొలిచిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’తో ఘనవిజయం అందుకున్న ఆర్‌పీఏ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ద్వితీయ చిత్రం ‘జక్కన్న’.

తొలిచిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’తో ఘనవిజయం అందుకున్న ఆర్‌పీఏ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ద్వితీయ చిత్రం ‘జక్కన్న’. సునీల్, మన్నార్ చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైన ర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సునీల్ చాలా ఎనర్జిటిక్‌గా నటించారు. ఆయన కామెడీ టైమింగ్‌కి, వంశీ టేకింగ్‌కి ప్రేక్షకులు క్లాప్స్ కొడతారు.

ఇటీవల చిరంజీవిగారి చేతుల మీదగా విడుదల చేసిన పాటలు సూపర్ హిట్ అవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. కబీర్‌సింగ్, సప్తగిరి, పృధ్వీ, పోసాని, నాగినీడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: సి. రామ్‌ప్రసాద్, సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement