మళ్లీ లవ్ లో పడ్డాడు! | Ssharad Malhotra confirms he's dating Pooja Bisht | Sakshi
Sakshi News home page

మళ్లీ లవ్ లో పడ్డాడు!

May 31 2016 9:03 AM | Updated on Sep 4 2017 1:21 AM

మళ్లీ లవ్ లో పడ్డాడు!

మళ్లీ లవ్ లో పడ్డాడు!

ప్రముఖ టీవీ నటుడు శరద్ మల్హోత్రా మళ్లీ లవ్ లో పడ్డాడు.

ప్రముఖ టీవీ నటుడు శరద్ మల్హోత్రా మళ్లీ లవ్ లో పడ్డాడు. వర్ధమాన నటి, మిస్ దివా ఫైనలిస్ట్ పూజా బిష్త్ తో నాలుగు నెలలుగా డేటింగ్ చేస్తున్నట్టు వెల్లడించాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా 8 నెలల క్రితం తనకు పూజ పరిచయమైందని తెలిపాడు.

'మేమిద్దం పరస్పరం అర్థం చేసుకున్నాం. మా ఇద్దరి మధ్య అన్నివిధాలా సాంగత్యం కుదిరింది. పూజ కలివిడిగా ఉంటుంది. ఎటువంటి డిమాండ్లు చేయదు. ఇప్పటివరకు ఆమె నన్ను ఒక్కమాట కూడా అనలేదు. ఆమెతో డేటింగ్ చేస్తున్నా'ని శరద్ పేర్కొన్నాడు. తామిద్దరం కలిసి షార్ట్ ఫిలిమ్ లో నటిస్తున్నామని 'కసమ్' నటుడు తెలిపాడు. తమ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్టీ బాగా కుదిరిందని చెప్పుకొచ్చాడు.

అంతకుముందు దివ్యాంక త్రిపాఠితో శరద్ ప్రేమాయణం సాగించాడు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ గతేడాది విడిపోయారు. జులైలో పెళ్లి చేసుకునేందుకు దివ్యాంక రెడీ అవుతోంది. కలర్ చానల్ లో 'బాక్స్ క్రికెట్ లీగ్'లో మాజీ ప్రియురాలితో కలిసి అతడు కనిపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement