ఇండస్ట్రీలో బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీలో బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది

Published Wed, Apr 25 2018 12:55 AM

special chit chat with producer lagadapati sridhar - Sakshi

ఈ నెల 29న జరగనున్న మా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్‌ రానుండటం ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్‌ను బిగ్‌ రేంజ్‌లో ప్లాన్‌ చేశాం. ఇటీవల జరిగిన ఆడియో ఫంక్షన్‌కు చిరంజీవిగారిని ఆహ్వానించాలని వెళ్లి కలిశాను. ‘‘సినిమా గురించి, బన్నీ కష్టం గురించి విన్నాను. బట్‌.. ఆడియో ఫంక్షన్‌కు రాలేను. అమెరికా వెళ్తున్నాను’’ అన్నారు. సినిమాకు మీ ఆశీర్వాదం కావాలి సర్‌ అంటే.. సెట్స్‌కు వచ్చారు చిరంజీవిగారు. టీమ్‌ అంతా హ్యాపీ ఫీలయ్యాం. ఆడియో ఫంక్షన్‌కు రాలేకపోతున్నానని ఆయన ఫీలయ్యారు’’ అన్నారు.

‘‘దేశం మనకేం చేసింది అన్నది కాదు.. దేశానికి మనం ఏం చేశాం అన్నది ముఖ్యం అనే పాయింట్‌తో  ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ ఉంటుంది. దేశానికి సేవ చేయాలనుకునే హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది సినిమాలో ఆసక్తికరం. దేశానికి సేవ చేస్తే ఎలాంటి సంతృప్తి కలుగుతుంది అన్న విషయం ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ‘రంగస్థలం, భరత్‌ అనే నేను’ సినిమాల రేంజ్‌లో మా సినిమా కూడా ఉంటుందని నా నమ్మకం’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్‌. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. మే 4న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ– ‘‘పదేళ్ల క్రితం మీతో సినిమా చేస్తానని బన్నీ (అల్లు అర్జున్‌) మాటిచ్చాడు. ఇప్పుడు ఇంత స్టార్‌డమ్‌ ఉన్నప్పుడు పిలిచి సినిమా చేశాడు. ఈ సినిమాలోని సూర్య క్యారెక్టర్‌ అల్లు అర్జున్‌కే సూట్‌ అవుతుంది. ఇండస్ట్రీలో ఈ సినిమా బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం.

హిందీలో డబ్‌ చేసే ఆలోచన ఉంది. నాగబాబుగారు బాగా çసహకరించారు. బన్నీ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఒకడు మారాడు అనే కంటే ఎలా మారాడు? అన్న విషయాన్ని ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తారు. దేశానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అని కల కనే యువకుడి కథ ఇది. టైటిల్‌లోనే ‘నా ఇల్లు ఇండియా’ అనే మాట వాడాం అంటే సినిమా స్పాన్‌ను అర్థం చేసుకోవచ్చు. థియేటర్స్‌లో ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్‌ బిగ్‌ ఎస్సెట్‌ అవుతుంది. ముఖ్యంగా ‘లవర్‌ ఆల్సో.. ఫైటర్‌ ఆల్సో..’ సాంగ్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంటుంది. ‘ఇరగ.. ఇరగ..’ సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ మంచి స్టెప్స్‌ ఇచ్చారు. బన్నీ ఇరగదీశాడు. అనూ ఇమ్మాన్యుయేల్‌ బాగా నటించింది. డ్యాన్స్‌ కూడా అదరగొట్టింది. విశాల్‌–శేఖర్‌ మంచి సంగీతం ఇచ్చారు. సినిమా బాగా రావడంలో సహనిర్మాత ‘బన్నీ’ వాసు పాత్ర ఉంది. ప్రొడక్షన్‌ వైపు చాలా కష్టపడ్డారు. వరుసగా టాప్‌ హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా అబ్బాయి (విక్రమ్‌)  హీరోగా కష్టపడి పైకి రావాలనుకుంటున్నాను. ‘ఎవడి గోల వాడిది 2’ చేయాలని ఉంది. ‘స్టైల్‌ 2’ కథ చేయాలనుకుంటున్నాను. తమిళ సినిమా ‘గోలీసోడా’ని ‘ఎవడూ తక్కువ కాదు’ పేరుతో రిలీజ్‌ చేద్దాం అనుకుంటున్నాం’’ అన్నారు. 

Advertisement
 
Advertisement