7 కోట్ల విరాళం

Singer Pink says she had coronavirus and makes donation  - Sakshi

 ప్రముఖ హాలీవుడ్‌ గాయని, పాటల రచయిత్రి, నటి పింక్‌ తాను కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రకటించారు. కరోనాపై పోరాటం కోసం దాదాపు 7 కోట్లు  విరాళం ప్రకటించారు. కొన్ని వారాల క్రితమే పింక్, ఆమె మూడేళ్ల కుమారుడు జేమ్సన్‌కి కరోనా లక్షణాలు కనిపించాయట. 2 వారాలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత ఇటీవలే కోలుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసి, 7 కోట్ల విరాళాన్ని కూడా ప్రకటించారు. అందులో 3.5 కోట్లు ఫిలడెల్ఫియా లోని టెంపుల్‌ యూనివర్శిటీ ఆసుపత్రికి, మిగతా 3.5 కోట్లను  లాస్‌ ఏంజెల్స్‌ మేయర్స్‌ ఎమర్జన్సీ ఫండ్‌కి అందజేస్తున్నట్టు తెలిపారు పింక్‌.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top