బిల్లా మళ్లీ వస్తున్నాడు | Simbu in Billa sequel | Sakshi
Sakshi News home page

బిల్లా మళ్లీ వస్తున్నాడు

Jun 7 2016 4:06 PM | Updated on Sep 4 2017 1:55 AM

బిల్లా మళ్లీ వస్తున్నాడు

బిల్లా మళ్లీ వస్తున్నాడు

కొన్ని సినిమాలకు భాషా బేదాలుండవు. విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనాలను నమోదు చేస్తాయి. అలా సౌత్ నార్త్ అన్న తేడాలేకుండా అన్ని భాషల్లోనే బిగ్ హిట్గా నిలిచిన సినిమా...

కొన్ని సినిమాలకు భాషా బేదాలుండవు. విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనాలను నమోదు చేస్తాయి. అలా సౌత్ నార్త్ అన్న తేడాలేకుండా అన్ని భాషల్లోనే బిగ్ హిట్గా నిలిచిన సినిమా బిల్లా. అమితాబ్ హీరోగా బాలీవుడ్లో తెరకెక్కిన డాన్ సినిమాను యుగంధర్ గా తెలుగులో, బిల్లాగా తమిళ్లో రీమేక్ చేసి సక్సెస్ సాధించారు.

ఈ జనరేషన్లో అదే సినిమాను షారూఖ్, డాన్ పేరుతో రీమేక్ చేస్తే, బిల్లా పేరుతో అజిత్, ప్రభాస్లు మరోసారి రీమేక్ చేశారు. తరువాత అజిత్, డేవిడ్ బిల్లా పేరుతో బిల్లా సినిమాకు ప్రీక్వల్ను తెరకెక్కించినా అది ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. తాజాగా మరోసారి బిల్లా సినిమా తెరమీదకు వచ్చింది. కోలీవుడ్ కాంట్రవర్షియల్ హీరో శింబు, బిల్లా సినిమాకు సీక్వల్ను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు.

చాలా రోజులుగా కెరీర్ పరంగా కష్టాల్లో ఉన్న శింబు, ఇటీవల విడుదలై ఇదు నమ్మ ఆలు సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. అదే జోరులో మరో రెండు సినిమాలను ప్రకటించాడు. అందులో ఒకటి బిల్లా సీక్వల్ అంటూ కన్ఫామ్ చేశాడు. ఈ సీక్వల్ను తన సొంతం బ్యానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు శింబు. ప్రీక్వల్తో నిరాశపరిచిన బిల్లా, సీక్వల్తో అయినా ఆకట్టుకుంటాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement