ఆయన మాటలు వేదవాక్కు

Shraddha Srinath in Pink Remake - Sakshi

సినిమా: ఆయన మాటలు వేదవాక్కు అని పేర్కొంది నటి శ్రద్ధా శ్రీనాథ్‌. ఈమె తాజాగా నటించిన తమిళ చిత్రం నేర్కొండ పార్వై.అజిత్‌ ప్రధాన పాత్రలో నటించిన ఇది హిందీలో అమితాబ్‌బచ్చన్,తాప్సీ నటించిన పింక్‌ చిత్రానికి రీమేక్‌. బాలీవుడ్‌ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మిస్తున్న ఇందులో అజిత్‌ న్యాయవాదిగా నటించారు. హెచ్‌.వినోద్‌ దర్శకతక్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇందులో అజిత్‌ నటించిన కోర్టు సన్నివేశాలు పేలతాయంటున్నారు చిత్ర వర్గాలు. స్నేహంగా మెలిగే యువకుల వల్ల అత్యాచారాలకు బలైన యువతుల ఇదివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం నేర్కొండ పార్వై. హిందీలో ఈ చిత్రం విమర్శకులు, నెటిజన్ల ప్రశంసలను పొందింది.

ఈ చిత్రం గురించి నటి శ్రద్ధాశ్రీనాథ్‌ తెలుపుతూ ఒక సంబంధానికి ఇరువురు సమ్మతం అవసరం అన్నది చాలా మందికి తెలియకపోవడం బాధాకరం అని పేర్కొంది. ఇందుకు కారణం చదువు లేనితనం, పురుషాధిక్యం, మనసు విప్పి మాట్లాడుకోకపోవడం వంటివి కావచ్చునని అంది. అలాంటి అంశాలతో కూడిన నేర్కొండ పార్వై చిత్రం హిందీ చిత్రం స్థాయిలో ఉండాలన్నది ఒక విషయం అయితే, తాను మాత్రం దీన్ని రీమేక్‌లా చూడలేదని చెప్పింది. ఒక అమ్మాయిగా తన పాత్రకు ఎంత నిజాయితీగా నటించగలనో అంతగా నటించానని చెప్పింది. ఇందులో ముఖ్య అంశం ఏమిటంటే అజిత్‌ ప్రధాన పాత్రలో నటించడం అని పేర్కొంది. చిత్రంలో ఆయన చెప్పే విషయాలను వినడానికి అభిమానులు రెడీగా ఉంటారని అంది. ఆయన మాటలు వేదవాక్కుగా ఉంటాయని చెప్పింది. సమాజంలోని చేదు విషయాలను ఒక స్టార్‌ నటుడు తెరపై చెబితే అవి చర్చనీయాంశంగా మారతాయని నటి శ్రద్ధా శ్రీనాథ్‌ పేర్కొంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 10న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top