కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

Sharwanand New Look In Upcoming Movie - Sakshi

స్వాతంత్య్ర దినోత్సవం రోజున గ్యాంగ్‌స్టర్‌గా థియేటర్స్‌లోకి రానున్నారు శర్వానంద్‌. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా నటించిన చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌ కథానాయికలుగా నటించారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మంగళవారం కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఇది వరకు ఈ చిత్రాన్ని ఆగస్టు 2న విడుదల చేయాలనుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘ఈ సినిమాలో శర్వానంద్‌ నటన ఆయన గత చిత్రాలతో పోల్చినప్పుడు విభిన్నంగా ఉంటుంది. 1990–2000 సమయంలో ఈ సినిమా స్క్రీన్‌ ప్లే ఉంటుంది. సుధీర్‌ వర్మ బాగా తెరకెక్కించారు. అన్నివర్గాల వారికీ నచ్చుతుంది. మా నూతన గ్యాంగ్‌స్టర్‌ను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top