పాటతో సండైకోళి –2 ప్రారంభం | Sandai Koli-2 movie started | Sakshi
Sakshi News home page

పాటతో సండైకోళి –2 ప్రారంభం

Sep 21 2017 4:23 AM | Updated on Sep 22 2017 12:17 PM

Sandai Koli-2 movie started

సండైకోళి–2 చిత్రానికి బుధవారం శ్రీకారం చుట్టారు.

తమిళసినిమా: సండైకోళి–2 చిత్రానికి బుధవారం శ్రీకారం చుట్టారు. చాలాకాలంగా ఈ చిత్రంపై పలు రకాల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు చిత్ర షూటింగ్‌ సాంగ్‌తో బుధవారం ప్రారంభమైంది. విశాల్, దర్శకుడు లింగుస్వామిలది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌ అని చెప్పవచ్చు. వీరి కలయికలో 2005లో వచ్చిన సండైకోళి చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటు, విశాల్‌కు మాస్‌ హీరో ఇమేజ్‌ కట్టబెట్టిన చిత్రంగా నమోదైంది.ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న చిత్రమే సండైకోళి–2.

మొదటి భాగంలో నటించిన నటుడు రాజ్‌కిరణ్‌ ఈ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇక హీరోయిన్లుగా త్రిష, కీర్తీసురేశ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. శక్తి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం కోసం చెన్నైలోని బిన్ని మిల్లులో మదురై ఉత్సవాలను తలపించే విధంగా భారీ సెట్‌ను వేశారు. ఆ సెట్‌లో విశాల్, కీర్తీసురేశ్‌ పాటతో చిత్రీకరణను ప్రారంభించారు. సండైకోళి చిత్రం తరువాత విశాల్, లింగుసామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సండైకోళి–2 చిత్రంపై కచ్చితంగా భారీ అంచనాలు నెలకొంటాయని వేరే చెప్పాలా? ఈ చిత్రాన్ని విశాల్‌ తన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement