లక్ష 'లైకు'ల లక్షణమైన హీరో | sampoornesh babu gets one lakh likes | Sakshi
Sakshi News home page

లక్ష 'లైకు'ల లక్షణమైన హీరో

Apr 27 2014 8:09 AM | Updated on Sep 2 2017 6:36 AM

లక్ష 'లైకు'ల లక్షణమైన హీరో

లక్ష 'లైకు'ల లక్షణమైన హీరో

ఒకప్పుడు సినిమాల్లో అవకాశం రావడమనేది అంత సులువైన విషయం కాదు.

ఒకప్పుడు సినిమాల్లో అవకాశం రావడమనేది అంత సులువైన విషయం కాదు. ఒకవేళ వచ్చినా ఏ చిన్నా చితకా పాత్రలో మాత్రమే. హీరోలవ్వడం అనేది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వస్తే తప్ప అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. కొంచెం అటూ ఇటుగా, ఇదే పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి సినీ ప్రపంచంలోకి ఏ మాత్రం సినీ సంబంధంలేని ఒక నటుడు వచ్చి కేవలం హీరో మాత్రమే కాదు ఏకంగా స్టార్ అయి చూపించాడు. అతడే 'హృదయ కాలేయం' సినిమా హీరో సంపూర్ణేష్ బాబు.
 
సంపూర్ణేష్ ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి కారణాలేవైనా.. అతన్ని జనాలకు దగ్గర చేసింది మాత్రం సోషల్ మీడియానే. చిత్రీకరణే మొదలవ్వకముందు విడుదల చేసిన సంపూ ఫోటోలు.. ఆ తర్వాత రాజమౌళి ట్వీట్‌తో సంచలనం సృష్టించాయి. తదనంతరం ఆ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం ఒక సంచలనమే. సినిమా విడుదలయ్యాక కూడా అదే పరంపర కొనసాగడంతో సంపూకు తిరుగులేకుండా పోయింది.
 
గత కొంత కాలంగా 'ఫేస్‌బుక్‌'లో తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ వారికి మరింత దగ్గరయిన సంపూర్ణేష్ బాబు.. తాజాగా మరో సంచలనానికి తెర లేపాడు. తన అఫీషియల్ ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో లక్షకు పై చిలుకు లైక్‌లతో దూసుకుపోతున్నాడు. ప్రతీ పోస్ట్‌కి చివర్లో, 'సదా మీ ప్రేమకు బానిసను' అని చెప్పుకునే సంపూ.. తనపై వచ్చే విమర్శలను కూడా చాలా ఓపికతో, సహృదయంతో ఎదుర్కొనే వ్యక్తిత్వంతో ముందుకు సాగిపోతున్నాడు. ఇలా తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నసంపూర్ణేష్ బాబు మున్ముందు ఇంకెన్ని సంచలనాలకు కేంద్ర బిందువవుతాడో వేచి చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement