‘సుశాంత్‌ మరణాన్ని వ్యక్తిగత కక్షలకు వాడుతున్నారు’

Samir Soni Soni Deletes His Post About Accuses Kangana Ranaut of Using Sushant Death - Sakshi

ముంబై: బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యపై గ‌త కొన్ని రోజులుగా బాలీవుడ్ లో పెద్ద దుమారం రేగుతోంది. సుశాంత్ మ‌ర‌ణంపై బాలీవుడ్ తార‌లంతా ఒక‌రిపై మ‌రొక‌రు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే సుశాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి నెపోటిజ‌మే కార‌ణ‌మంటూ అత‌ని అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కులు కూడా ఆరోపిస్తున్నారు. బాలీవుడ్ క్వీన్‌ కంగ‌నా ర‌నౌత్ సైతం సుషాంత్ మ‌ర‌ణాన్ని ఉద్దేశించి బాలీవుడ్‌లో నెపోటిజంపై తీవ్రంగా మండిప‌డిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ న‌టుడు స‌మీర్ సోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు మరో కొత్త‌ వివాదానికి తెరలేపింది. సుషాంత్ మ‌ర‌ణాన్ని చాలా మంది త‌మ వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌ను తీర్చుకోవ‌డానికి ఉప‌యోగించుకుంటున్నారంటూ కంగ‌నాను ఉద్దేశిస్తూ పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్ పెట్టిన కొద్ది సేప‌టికే అత‌డికి సుషాంత్ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ మొద‌ల‌వ‌డంతో వెంట‌నే ఆ పోస్ట్ ని తొల‌గించి అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. (చదవండి: ‘కరణ్‌‌ జోహార్‌‌ను అభిమానిస్తానని చెప్పలేదు’)

ఆ పోస్ట్‌లో స‌మీర్.. “నేను ఇంతకు ముందే చెప్పాను. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఒక పెద్ద విషాదం. అతను న్యాయం పొందటానికి అర్హుడు. కానీ అత‌ని మ‌ర‌ణాన్ని త‌మ వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల ప‌రిష్కారానికి ఉప‌యోగిస్తున్న ఎవ‌రికైనా(కంగ‌నాతో స‌హా) నేను వ్య‌తిరేకం. ఇది చాలా హేయ‌మైన చ‌ర్య’’ అని ట్వీట్‌ చేశాడు. “మీ తుపాకీని చనిపోయిన వ్యక్తి భుజం మీద నుండి కాల్చడం మానేయండి’’ అని స‌మీర్ విమర్శించాడు. కంగనా ఇటీవల అర్నాబ్ గోస్వామికి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత సమీర్ ఈ పోస్టులు పెట్టాడు. ఆ షోలో ఆమె కొంతమంది బాలీవుడ్‌ నిర్మాతలైన మహేష్ భట్, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, తాప్సీ పన్నూ, స్వరభాస్కర్ వంటి వారిపై ఆరోపణలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత నెల జూన్‌ 14న ముంబైలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్‌  ఆత్మహత్యపై కంగనా జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి నిర్వ‌హించిన షోలో మాట్లాడుతూ బాలీవుడ్‌పై మండిపడ్డారు. (చదవండి: అలియా సిగ్గు లేకుండా అవార్డు తీసుకుంది)

Apologies and love to all. ❤️

A post shared by Samir Soni (@samirsoni123) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top