‘సాహెబా-సుబ్రహ్మణ్యం’ల ప్రేమకథ | saheba subrahmanyam first look teaser | Sakshi
Sakshi News home page

‘సాహెబా-సుబ్రహ్మణ్యం’ల ప్రేమకథ

Apr 12 2014 11:23 PM | Updated on Sep 2 2017 5:56 AM

‘సాహెబా-సుబ్రహ్మణ్యం’ల ప్రేమకథ

‘సాహెబా-సుబ్రహ్మణ్యం’ల ప్రేమకథ

ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశికిరణ్ నారాయణ దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. దిలీప్‌కుమార్, ప్రియాల్‌గోర్ జంటగా నటిస్తున్న

ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశికిరణ్ నారాయణ దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. దిలీప్‌కుమార్, ప్రియాల్‌గోర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి డా.కొల్లా నాగేశ్వరరావు నిర్మాత. ఈ సినిమా ప్రచార చిత్రాలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పరుచూరి గోపాలకృష్ణ, ఎన్వీప్రసాద్, సీనియర్ నరేశ్, ఎమ్మెస్ నారాయణ, వివేక్ కూచిభొట్ల, కాశీవిశ్వనాథ్ తదితరులు అతిథులుగా పాల్గొని సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇది సున్నితమైన ప్రేమకథ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇది మలయాళం రీమేక్. ఈ కథలోని ప్రేమ, భావోద్వేగాలు నన్ను కట్టిపడేశాయి. ఒక మంచి డెరైక్టర్‌ని ఎన్నుకొని ఈ సినిమా తీద్దామనుకున్నాను. అనుకున్నట్లే మంచి దర్శకురాలిని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమాతో ఆమె అగ్ర దర్శకురాలు అవుతుంది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement