రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

RGV Shared His Triple Riding Without Helmet Pic Goes Viral - Sakshi

నిత్యం వివాదాలతో సావాసం చేసే ఆర్జీవీ మరోసారి హాట్‌టాపిక్‌గా మారాడు. హెల్మెట్‌ లేకుండా ట్రిపుల్‌ రైడింగ్‌లో వెళ్తూ ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ వివాదం సృష్టించాడు. అసలేం ఏం జరిగిందంటే.. టాలీవుడ్‌ డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌.. రామ్‌ గోపాల్‌వర్మ శిష్యుడన్న సంగతి తెలిసిందే. చాల కాలానికి తన శిష్యుడు పూరి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో హిట్‌ కొట్టాడు. ఈ చిత్రాన్ని చూసేందుకు వర్మ రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ తన శిష్యులతో కలిసి బైక్‌పై వెళ్లాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆర్జీవీ చేసిన ట్రిపుల్‌ రైడింగ్‌పై ట్రాఫిక్‌ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రిపుల్‌ రైడింగ్‌, నో హెల్మెట్‌ కారణంగా ఆర్జీవీకి ట్రాఫిక్‌ పోలీసులు రూ.1,335 ఫైన్‌ విధించారు. అసలు ఈ వివాదం మొదలైందీ వర్మ వల్లే. ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు అజయ్‌ భూపతి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ డైరెక్టర్‌ అగస్త్య మంజు, తాను బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌లో హెల్మెట్‌ లేకుండా సినిమాను చూడటానికి వెళ్తున్నానని ఫోటోను షేర్‌ చేశాడు ఆర్జీవీ . దీంతో ఈ పిక్‌ వైరల్‌ కాసాగంది. ఇక ఈ ఫోటోను నెటిజన్లు కామెంట్లతో ఓ ఆట ఆడేసుకున్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు వర్మ చాలెంజ్‌ విసిరాడని, మూడు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించారని.. నో హెల్మెట్‌, త్రిబుల్‌ రైడిండ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తూ.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు ట్యాగ్‌ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు చివరకు ఫైన్‌ విదించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top