కొత్త లైఫ్‌ స్టార్ట్‌

Renu Desai Secret Engagement Pics Viral  - Sakshi

నటి, దర్శకురాలు, పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ నిశ్చితార్థం ఆదివారం జరిగింది. పవన్‌ కల్యాణ్‌తో కొన్ని సంవత్సరాలు సహజీవనం చేశాక 2009లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు మూడేళ్లకు 2012లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్యా ఉన్న విషయం తెలిసిందే. విడిపోయిన తర్వాత కూడా ఫంక్షన్లు, బర్త్‌డేలకు కలుస్తూనే ఉండేవారు పవన్‌ కల్యాణ్, రేణు దేశాయ్‌. అయితే అవి ప్యూర్లీ పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్‌ అనే వార్తలు ఉండేవి. పవన్‌ కల్యాణ్‌ నుంచి విడాకులు తీసుకున్నాక ఒంటరిగా ఉంటున్న రేణు ఇటీవలే మళ్లీ ప్రేమలో పడ్డానంటూ ట్వీటర్‌లో పోస్ట్‌లు పెట్టారు. ఆ లవ్‌ని మ్యారేజ్‌ వరకూ తీసుకెళ్లారు. అయితే తాను ఎవర్ని ప్రేమిస్తున్నానో బయటపెట్టని రేణు ఆదివారం నిశ్చితార్థం జరిగాక కూడా కాబోయే భర్త పేరు, ఇతర వివరాలు బయటపెట్టలేదు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించి రెండు ఫొటోలు షేర్‌ చేశారు. ‘‘నా పిల్లలు లేనిదే నా సంతోషం పరిపూర్ణం కాదు. నా లైఫ్‌లో ఓ కొత్త ఫేజ్‌ స్టార్ట్‌ చేస్తున్నప్పుడు వాళ్లిద్దరూ నా పక్కన ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు రేణు దేశాయ్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top