యువ నటికి వేధింపులు | Reba Monica John's stalker arrested in Bengaluru | Sakshi
Sakshi News home page

యువ నటికి వేధింపులు; ఒకరి అరెస్ట్‌

Oct 30 2017 8:18 PM | Updated on Oct 30 2017 8:18 PM

Reba Monica John's stalker arrested in Bengaluru

సాక్షి, బెంగళూరు: తనను ప్రేమించాలంటూ మలయాళ నటి, మోడల్‌ రెబా మోనికా జాన్‌ వెంటపడుతున్న యువకుడిని సోమవారం మడివాళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేరళకు చెందిన మోనికా జాన్‌ బెంగళూరులో నివాసముంటోంది. ప్రతి ఆదివారం ఆమె చర్చికి వెళ్లేది. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్‌సిటీకి చెందిన ఫ్రాంక్లిన్‌ విసిల్‌ అనే యువకుడికి ఆమె పరిచయమైంది. ఈ నేపథ్యంలో ఫ్రాంక్లిన్‌ తనను ప్రేమించాలని, పెళ్లిచేసుకోవాలని ఆమె వెంటబడుతున్నాడు. రోబోమోనికాజాన్‌ అందుకు నిరాకరించి ఆ యువకుడిని తీవ్రంగా హెచ్చరించింది. కానీ ఫ్రాంక్లిన్‌ ఆమె ఫోన్‌ నంబర్‌ తెలుసుకుని అశ్లీల మెసేజ్‌లు పంపేవాడు.

దీనిపై మోనికా జాన్‌ రెండురోజుల క్రితం మడివాళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఫ్రాంక్లిన్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 354డీ కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచామని పోలీసు అధికారి తెలిపారు. తర్వాత బెయిల్‌పై అతడిని విడిచిపెట్టినట్టు వెల్లడించారు. గతేడాది విడుదలైన ‘జాకొబింతె స్వర్గరాజ్యం’ సినిమాతో మోనికా జాన్‌ మలయాళ సినిమా పరిశ్రమలో తెరంగ్రేటం చేసింది. ప్రస్తుతం ‘పిపిన్‌ చువతిలె ప్రణయం’  సినిమాలో నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement