భయపెట్టడానికి రెడీ అవుతున్న రష్మీ | Rashmi Gauthm in Zombie format movie tanu vachenanta | Sakshi
Sakshi News home page

భయపెట్టడానికి రెడీ అవుతున్న రష్మీ

Mar 1 2016 5:34 PM | Updated on Sep 3 2017 6:46 PM

భయపెట్టడానికి రెడీ అవుతున్న రష్మీ

భయపెట్టడానికి రెడీ అవుతున్న రష్మీ

బుల్లి తెర మీద స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మి ఇప్పుడు వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మి ఇప్పుడు వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే పలుచిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్గా సక్సెస్ కొట్టాలని భావిస్తోంది. జాతీయ అవార్డ్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.

అదే జోష్లో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. తెలుగుతెర మీద ఇంత వరకు నేరుగా రాని జాంబి తరహా కథాకథనాలతో తెరకెక్కనున్న కామెడీ ఎంటర్టైనర్లో రష్మి లీడ్ రోల్లో కనిపించనుంది. జాంబీ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'తను వచ్చెనంట' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

రష్మితో పాటు తేజ కాకుమాను, ధన్యా బాలకృష్ణన్, చలాకీ చంటి ఇతర ప్రదాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు బుల్లితెర మీద, వెండితెర మీద తన గ్లామర్తో, మంచి టైమింగ్తో నవ్వించిన రష్మి ఇప్పుడు ఈ హర్రర్ సినిమాతో ఎంత వరకు భయపెడుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement