అనుష్కను చాలా మిస్‌ అవుతున్నా: హీరో

Ranveer Singh Said He Missed Anushka Sharma  - Sakshi

అవును రణ్‌వీర్‌ సింగ్‌ అనుష్కను చాలా మిస్‌ అవుతున్నారంట. అదేంటి ఈ హీరో మిస్‌ అవ్వాల్సింది దీపికా పదుకోన్‌ని కదా . అనుష్కను మిస్‌ అవ్వడం ఏంటి, అది కూడా అనుష్కకు వివాహం జరిగిన తర్వాత అని  అనుకుంటున్నారా.. అయితే ఒక్క నిమిషం. ఈ హీరో అనుష్కను మిస్‌ అవుతున్నాను అన్నది ఇప్పుడు కాదు. ఓ ఆరేళ్ల క్రితం 2013లో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌వీర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అనుష్క శర్మ చాలా మంచిదంటూ తెగ పొగిడారు. 

అనుష్క - రణ్‌వీర్‌ తొలిసారి 2010లో వచ్చిన ‘బ్యాండ్‌ బాజా బరాత్‌’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు షికారు చేశాయి. అయితే ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు. అందుకు కారణం ‘బ్యాండ్‌ బాజా బరాత్‌’ అనంతరం అనుష్కకు చాలా ఆఫర్స్‌ వచ్చాయంట, కానీ రణ్‌వీర్‌ మాత్రం అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారంట. ఈ ప్రొఫెషనల్‌ జెలసి వల్ల వీరు ఇద్దరు విడిపోయారనే వార్తలు ప్రచారం అయ్యాయి.

అయితే కొందరు మాత్రం వీటిని ఖండించడమే కాక దీపిక పదుకోన్‌ వల్లే వీరిద్దరు విడిపోయారని ప్రచారం చేశారు. అందుకు కారణం ఉంది. ‘బ్యాండ్‌ బాజా బరాత్‌’ తర్వాత రణ్‌వీర్‌ దర్శకుడు సంజయ్‌ బన్సాలీ చిత్రం ‘గోలియోంకి రాస్‌లీల : రామ్‌ లీల’ చిత్రంలో దీపికాతో కలిసి నటించారు. ఆ సమయంలో రణ్‌వీర్‌ దీపికతో సన్నిహితంగా మెలిగాడని.. ఈ విషయం అనుష్కకు నచ్చలేదని అందుకే విడిపోయారనే వార్తలు కూడా షికారు చేశాయి.

ఏది ఏమైనా నాటి నుంచి రణ్‌వీర్‌ - అనుష్కల మధ్య మాటలు బంద్‌ అయ్యాయి. ఈ విషయం గురించి రణ్‌వీరే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తమ ఇద్దరి మధ్య దూరం పెరిగిన మాట వాస్తవమే అని, తాము మాట్లాడుకోవడం లేదని తెలిపారు. ఆ సమయంలోనే తాను అనుష్కని చాలా మిస్‌ అవుతున్నట్లు కూడా చెప్పారు.

ఈ విషయం గురించి రణ్‌వీర్‌ ‘నేను అనుష్కను చాలా మిస్‌ అవుతున్నాను. చాలా మంది ఆమెను తప్పుగా అర్ధం చేసుకున్నారు. అసలు ఆమె గురించి వారికి ఏమి తెలియదు. తను ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి మనిషి అనే విషాయాలు తెలుసుకోకుండానే ఆమె గురించి తప్పుగా మాట్లాడతున్నారు. నేను ఇప్పుడు తన గురించి చెప్పే మాటలు మీరు నమ్మకపోవచ్చు. కానీ నా జీవితంలో నేను కలిసిన అతికొద్ది మంది మంచి వారిలో అనుష్క ఒకరు. ఆమె చాలా నిజాయితీగా, స్వచ్ఛంగా ఉంటారు.

నేను చెప్పేది వాస్తవం.. ఆమె మనసు చాలా మంచిది. నా గురించి తప్పుడు వార్తలు వచ్చినా బాధపడను కానీ ఆమె గురించి చెడు ప్రచారం జరిగితే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది అని తెలిపారు. అయితే ఇవన్ని 2013 నాటి మాటలు. ఆ తర్వాత కూడా వీరిద్దరు 2015లో జోయా అక్తర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్‌ ధడక్నే దో’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతానికైతే వీరిద్దరి వారి వారి జీవితాల్లో బిజీగా ఉన్నారు. గతేడాది డిసెంబర్‌ 11న అనుష్క టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని వివాహం చేసుకుని, సంతోషంగా ఉన్నారు. మరో పక్క రణ్‌వీర్‌ వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం రణ్‌వీర్‌ దీపికా పదుకోన్‌తో ప్రేమలో ఉన్నారు, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top