కలెక్షన్ల బాటలో మర్దానీ-2

Rani Mukerji Mardaani 2 First Day Collection - Sakshi

బాలీవుడ్‌ నటి రాణి ముఖర్జీ తాజాగా నటించిన చిత్రం మర్దానీ-2.  డిసెంబర్‌ 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2014లో వచ్చిన ‘మర్దానీ’కి సీక్వెల్‌గా మార్దానీ-2 తెరకెక్కిన విషయం తెలిసిందే. గోపి పుత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా వసూళ్లు రాబడుతోంది. తొలిరోజు  సుమారు రూ. 5 నుంచి 6 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్‌ వర్గాల అంచనా. అదేవిధంగా ఈ చిత్రంపై ప్రేక్షకుల స్పందన, విమర్శకుల సమీక్షలు పరిశీలిస్తే.. ఇక మీదట బాక్సాఫీసు వద్ద సందడి చేయనుందని చిత్రం బృందం భావిస్తోంది. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిణి శివానీ శివాజీరాయ్‌గా రాణి ముఖర్జీ  నటించారు.

రాణిముఖర్జీ 2018లో నటించిన హిచ్కి కూడా విడుదలైన మొదటి రోజు సుమారు రూ. 3.30 కోట్లు రాబట్టింది. రెండో రోజు నుంచి ఈ చిత‍్రం కలెక్షన్లు పెరుగుతూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోయింది. అదేవిధంగా మంచి స్పందన లభిస్తున్న మార్దానీ-2 కూడా కలెక్షన్లు వేగం పెరిగి బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ‘మర్దానీ 2’ లో విక్రమ్‌ సింగ్‌ చౌహాన్‌, శ్రుతి బాప్నా ప్రధాన పాత్రలు పోషించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top