గల్లీబాయ్‌కు ఆస్కార్‌ రాదు..

Rangoli Chandel Criticised Gully Boy After Omission By Oscar - Sakshi

బాలీవుడ్‌లో హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఎంత ఫేమసో.. ఆమె సోదరి రంగోలీ చందేల్‌ అంతకన్నా పాపులర్‌. గతంలో హృతిక్‌రోషన్‌, దర్శకుడు క్రిష్‌, మహేశ్‌భట్‌, తాప్సీ, కరణ్‌ జోహార్‌, అలియా భట్‌ ఇలా ఎందరిపైనో మాటల దాడికి దిగింది రంగోలీ. తాజాగా ఆమె సినీ నటులను కాకుండా ఓ బాలీవుడ్‌ సినిమాను టార్గెట్‌ చేసింది. భారత్‌ తరపున ఆస్కార్‌ నామినేషన్‌కు ఎంపికైన గల్లీబాయ్‌ ఆస్కార్‌ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గల్లీబాయ్‌ చిత్రంపై రంగోలీ తీవ్ర విమర్శలు చేసింది.

‘8 మైల్‌ అనే హాలీవుడ్‌ సినిమా ఆధారంగా ‘గల్లీబాయ్‌’ తెరకెక్కించారు. సినిమా బాగుందని ప్రచారం చేయడానికి సినీ విమర్శకులకు ఎంతిచ్చారో ఎవరికి తెలుసు? యురి, మణికర్ణిక వంటి సినిమాల్లాగా ఇది ఒరిజినల్‌ కథ కాదు. హాలీవుడ్‌ నుంచి కాపీ కొట్టిన చిత్రమే గల్లీబాయ్‌. అలాంటి సినిమాకు వాళ్లెందుకు అవార్డు ఇస్తారు’ అని రంగోలీ ప్రశ్నించింది. కాగా రణవీర్‌ సింగ్‌, అలియా భట్‌ జంటగా నటించిన ‘గల్లీబాయ్‌’ ఫిబ్రవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. జోయా అక్తర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.238 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. భారత్‌ తరపున ఆస్కార్‌ నామినేషన్‌కు ఎంపికైంది. కానీ సోమవారం ప్రకటించిన టాప్‌ టెన్‌ చిత్రాల్లో చోటు దక్కకపోవడంతో ఆస్కార్‌ చేజారినట్టైంది. ఇక మదర్‌ ఇండియా, సలాం బాంబే, లగాన్‌ చిత్రాల తర్వాత మరే భారత సినిమా ఆస్కార్‌ను అందుకోలేకపోయాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top