అందుకే.. ‘ఇస్మార్ట్‌’గా వాయిదా వేశారు

Ram Ismart Shankar Movie Releasing On 18th July - Sakshi

ఈ కాలంలో సినిమా తీయడం ఎంత కష్టమో.. దానికి సరైన పబ్లిసిటీ, ప్రమోషన్స్‌, రిలీజ్‌ డేట్స్‌ అన్నింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని సినిమాలు సరైన పబ్లిసిటీ లేక కనమరుగైతే.. మరికొన్ని సరైన సీజన్‌, టైమ్‌కు విడుదలకాక ఆశించిన మేర సక్సెస్‌ను సాధించలేకపోయాయి. అయితే ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రయూనిట్‌ మాత్రం ఇస్మార్ట్‌గా ఆలోచించింది. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని.. ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఇది కరెక్ట్‌ సీజన్‌ కాదనుకొని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్‌, సాంగ్స్‌తో సినిమాపై హైప్‌ పెంచేసిన యూనిట్‌.. ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. కానీ ప్రస్తుతం వరల్డ్‌ కప్‌ ఫీవర్‌ నడుస్తున్న నేపథ్యంలో ఈచిత్రాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ 14న జరుగుతుండటంతో.. ఆ తరువాతే రిలీజ్‌ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జూలై 18న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top