రామరాజు@ పోలీస్‌ | Ram charan RRR movie updates | Sakshi
Sakshi News home page

రామరాజు@ పోలీస్‌

Feb 11 2019 2:29 AM | Updated on Jul 14 2019 4:08 PM

Ram charan RRR movie updates - Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి నిత్యం ఏవో కొత్త వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ పాత్ర పేరు రామరాజు అనే వార్త నెట్టింట్లో షికారు చేస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రబృందం షూటింగ్‌ నుంచి చిన్న విరామం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో రామరాజు అనే పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రామ్‌చరణ్‌ కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పోలీస్‌ చెక్‌పోస్ట్‌ నేపథ్యంలో భారీ యాక్షన్‌ సీన్‌ను తెరకెక్కించారు. అయితే..‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి.

వాటిలో అనాంగ్‌పూర్‌ పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ అనే పేరుతో పక్కనే బ్రిటిష్‌ జెండా ఉన్న ఓ ఫొటో ఉంది. దీంతో ఈ సినిమా 1920 టైమ్‌లో హర్యానా రాష్ట్రం నేపథ్యంలో సాగనుందనే టాక్‌ జోరుగా నడుస్తోంది. అంటే...బ్రిటీష్‌ ప్రభుత్వం టైమ్‌లో  చరణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారెమోనని కొందరు ఊహిస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ పాత్ర గురించి కూడా చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో కథానాయికలుగా బాలీవుడ్‌ హీరోయిన్లు పరిణీతి చోప్రా, ఆలియా భట్‌ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ కీలక పాత్ర కోసం అక్షయ్‌ కుమార్‌ను సంప్రదించారట టీమ్‌. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement