తలకిందులైంది

Rakul Preet Singh Poses During Night Shoot  - Sakshi

మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, ఆ రోజంతా చేయాల్సిన పనులకు రెడీ అయిపోవడం కామన్‌. అయితే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాత్రం ఎన్ని గంటలు నిద్రపోదామా? అని ఆలోచిస్తున్నారు. అదేంటీ.. ఆమె చేతిలో సినిమాలు లేవా అంటే.. ఎందుకు లేవు. ఈ బ్యూటీ ఫుల్‌ బిజీ. మరి.. పొద్దు పొద్దున్నే నిద్ర ఏంటీ? షూటింగ్‌లు డుమ్మా కొడుతున్నారా? అంటే.. అదేం కాదు. ఆమె నైట్‌ షూట్స్‌లో పాల్గొంటున్నారు. అదీ సంగతి. రాత్రంతా షూటింగ్‌ చేసి మార్నింగ్‌ ప్యాకప్‌ చెప్పాక బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, వెంటనే నిద్రపోతున్నారు. నైట్‌ డిన్నర్‌ చేసి, షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు రకుల్‌. సో.. నైట్‌ షూట్స్‌లో పాల్గొంటూ సూర్యుడికి గుడ్‌నైట్, చంద్రునికి గుడ్‌మార్నింగ్‌ చెప్తున్నారీ బ్యూటీ. అంటే రకుల్‌ రొటీన్‌ లైఫ్‌ తలకిందులైందన్నమాట.

రంజిత్‌ దర్శకునిగా పరిచయం అవుతూ కార్తీ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో రకుల్‌ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నైట్‌ షూట్‌లోనే పాల్గొంటున్నారు రకుల్‌. ఇంతకుముందే ‘ఖాకీ’ చిత్రంలో జంటగా నటించిన కార్తీ, రకుల్‌ మళ్లీ ఈ సినిమా కోసం జోడీ కట్టడం విశేషం. ఇందులో రమ్యకృష్ణ, సీనియర్‌ నటుడు కార్తీక్‌ కీలక పాత్రలు చేయనున్నారని టాక్‌. ఈ సినిమాకు ‘దేవ్‌’ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంతో పాటు సూర్య సరసన ఒక సినిమా, శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నారు రకుల్‌. హిందీలో అజయ్‌ దేవగణ్‌ సరసన ఈ బ్యూటీ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతా సరే కానీ.. తెలుగులో రకుల్‌ అధికారికంగా ఏ సినిమాకూ గ్రీన్‌  సిగ్నల్‌ ఇవ్వకపోవడం విశేషం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top