రకుల్‌ రచ్చ

Rakul Preet Singh Hottest Photo Viral In Social Media - Sakshi

సినిమా వాళ్లు తమను తాము ప్రమోట్‌ చేసుకోవడానికి ఇప్పుడు బోలెడు సామాజిక మాధ్యమాలున్నాయి. ముఖ్యంగా అలాంటి వాటిని ఉపయోగించుకోవడానికి హీరోయిన్లు ముందుంటున్నారు. అలాంటి వాళ్లలో హిరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఒకరు. ఇంతకుముందు చాలా బిజీగా ఉన్న ఈ బ్యూటీకి ఇటీవల అవకాశాలు పలచబడ్డాయి. ప్రస్తుతం హిందీలో ఒక చిత్రం చేస్తున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌ కోలీవుడ్‌లో సూర్యకు జంటగా నటించిన ఎన్‌జీకే చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రం 31న తెరపైకి రానుంది. నటుడు శివకార్తికేయన్‌తో ఒక చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతానికైతే దక్షిణాదిలో ఒకటి రెండు చిత్రాలే చేతిలో ఉన్నాయి. దీంతో చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి మంచి గ్లామర్‌ ఫొటోను తన ఇన్‌స్ట్రాగాంలో పోస్ట్‌ చేసింది. స్లీవ్‌లెస్‌ జాకెట్, జీన్స్‌ పాంటు ధరించిన ఆ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే తాను ధరించిన ప్యాంటుకు జిప్‌ కూడా వేసుకోకపోవడం. ఆ ఫొటోనే ఇప్పుడు సినీ వర్గాల్లో రచ్చగా మారింది. అయితే ఈ ఫొటోను పోస్ట్‌ చేసిన ఆరు గంటల్లోపే ఆరు లక్షల మందికి పైగా లైక్‌ చేశారు. సుమారు నాలుగు వేలమందికి పైగా కాంమెంట్స్‌ చేశారు. అందులో చాలా మంది రకుల్‌ప్రీత్‌సింగ్‌ అందాన్ని పొగడగా, మరి కొందరు తన దుస్తులను తీవ్రంగా విమర్శించారు. మరి కొందరు తుంటరి కుర్రాళ్లు నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ ప్యాంటుకు బటన్‌ పెట్టుకోవడం మరిచిపోయినట్లుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఏదైతేనేం మొత్తం మీద రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఏం కోరుకుందో అది నెరవేరింది. అయితే మంత్రాలకు చింతకాయలు రాలవనే సామెత ఉంది. మరి రకుల్‌ప్రీత్‌సింగ్‌ గ్లామర్‌ ప్లాన్‌ ఎంత వరకు అవకాశాలను తెచ్చి పెడుతుందో చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top