
జైల్లో ఊచలు లెక్కపెడుతున్న డేరా బాబాకు వాతలు పెట్టే ఓ సిన్మా మొదలైంది.
జైల్లో ఊచలు లెక్కపెడుతున్న డేరా బాబాకు వాతలు పెట్టే ఓ సిన్మా మొదలైంది. టైటిల్... ‘అబ్ ఇన్సాఫ్ హోగా’. బీటౌన్ ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ ఈ సిన్మాకు కర్త, కర్మ, క్రియ. ఇందులో ఆమె హనీప్రీత్ పాత్రలో నటిస్తుండగా, ఆమె తమ్ముడు రాకేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ హనీప్రీత్, బాబాలపై ఓ ఐటమ్ సాంగ్ తీశారు.
డేరాలో బాబా రంగులు, హనీప్రీత్‌తో అతడి శృంగార లీలలన్నీ నాకు ముందే తెలుసంటున్నారు రాఖీ. ఓసారి డేరాలోకి వెళ్లినప్పుడు వయాగ్రా పొట్లాలు చూశారట! అప్పుడే ఏదో ఒక రోజు వీడి చీకటి చరిత్రను ప్రజలకు తానే చెప్పాలని నిర్ణయించుకున్నారట. బాబా జైలుకి వెళ్లిన తర్వాత సినిమా స్టార్ట్ చేశానంటున్నారు. జైల్లోని బాబా తన ఫ్లాష్‌బ్యాక్ చెప్పడంతో సినిమా మొదలవుతుందట.