మా లక్ష్యం అదే! | Sakshi
Sakshi News home page

మా లక్ష్యం అదే!

Published Fri, Sep 15 2017 12:57 AM

మా లక్ష్యం అదే!

కథలో కొత్తదనానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీయాలన్నదే మా లక్ష్యం. నేటి ట్రెండ్‌కు తగ్గ జనరంజక చిత్రాల్ని నిర్మించాలన్నదే మా అభిమతం’’ అని నిర్మాతలు రాజ్‌కుమార్‌ బృందావనం, సునీత రాజ్‌కుమార్‌ అన్నారు. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో వారు నిర్మించిన ‘శ్రీవల్లీ’ సినిమా ఈరోజు రిలీజవుతోంది.

రాజ్‌కుమార్, సునీత మాట్లాడుతూ– ‘‘మాది పాలకొల్లు. ఈ ప్రాంతం నుంచి ఉద్దండులైన సినీ ప్రముఖులు వచ్చారు. వారి స్ఫూర్తితో సినిమా రంగంలోకి వచ్చాం. ‘బాహుబలి’ మాటల రచయిత విజయ్‌కుమార్‌ ద్వారా విజయేంద్ర ప్రసాద్‌గారిని కలిశాం. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఆయన చెప్పిన కథ నచ్చింది. ఆయన మాత్రమే కథకి న్యాయం చేయగలరని భావించి, దర్శకత్వం చేయమన్నాం.

శ్రీవల్లీ అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది.  ప్రతిక్షణం మలుపులతో కొత్త అనుభూతినిస్తుంది. గ్రాఫిక్స్‌ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. రాజ్‌తరుణ్‌ హీరోగా సుకుమార్‌ రైటింగ్స్‌లో మా తర్వాతి సినిమాను చేయనున్నాం. ఈ చిత్రానికి ‘కుమారి 21ఎఫ్‌’ ఫేమ్‌ సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహిస్తారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలందిస్తారు. ఎప్పటికైనా పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలన్నదే మా అభిలాష’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement