మగధీర కాంబినేషన్ రిపీట్!
బాహుబలి’తో తెలుగు సినీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ తర్వాత ఆయన చేయబోయే చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్: ‘బాహుబలి’తో తెలుగు సినీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ తర్వాత ఆయన చేయబోయే చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కథానాయకుడు ఎవరన్న దానిపై టాలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోందని చెప్పాలి. అయితే, రాజమౌళి మాత్రం ఆచితూడి అడుగులు వేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ లేని చిత్రాన్ని తీసే ఆలోచన ఉందని గతంలో వెల్లడించిన జక్కన్న.. ఆ చిత్రం ఏంటన్నది మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలో పలు వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్టీఆర్ కథానాయకుడిగా ఓ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తారని గతకొంత కాలంగా గుసగుసలు వినిపించాయి. తాజాగా మరో వార్త అటు చిత్ర పరిశ్రలోనూ, ఇటు సోషల్‌మీడియా వేదికగా హల్‌చల్ చేస్తోంది. రామ్‌చరణ్-రాజమౌళి కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతుందని అంటున్నారు. గతంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా రాజమౌళి ‘మగధీర’ను తెరకెక్కించారు. చెర్రీ సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ఆ చిత్రం నిలిచింది. వీరిద్దరూ కలిసి ఓ చిత్రం చేయబోతున్నారన్న వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తారని అంటున్నారు. మరి ‘మగధీర’ కాంబినేషన్‌పై అధికారికంగా ప్రకటన రావాల్సివుంది.



