ప్రతి సినిమా స్పెషలే

Raj Tarun- Raju Gadu will provide full-fledged entertainment - Sakshi

‘‘సినిమా రిజల్ట్‌ని డిసైడ్‌ చేసే ఫ్యాక్టర్స్‌ చాలానే ఉంటాయి. ఎక్కువ చిత్రాల్లో నటించాలని ఆరాటపడను. మంచి చిత్రాలు చేయాలని ఆచితూచి స్క్రిప్ట్‌ను ఎంచుకుంటున్నాను. నేను చేసే ప్రతి సినిమా నాకు స్పెషలే. తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడే కెరీర్‌లో ముందుకు వెళ్లగలుగుతాం’’ అన్నారు రాజ్‌ తరుణ్‌. సంజనారెడ్డి దర్శకత్వంలో రాజ్‌ తరుణ్, అమైరా దస్తూర్‌ జంటగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మాం సుంకర నిర్మించిన చిత్రం ‘రాజుగాడు’. నటుడు రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్ర చేసిన ఈ చిత్రం జూన్‌ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయల సమావేశంలో హీరో రాజ్‌ తరుణ్‌ పలు విషయాలు ముచ్చటించారు.

► మహిళా దర్శకులతో వరుస చిత్రాలు చేయడానికి పెద్దగా కారణాలు లేవు. యాదృశ్చికంగా అలా కుదిరిందంతే. ‘రంగులరాట్నం’ సినిమా కంటే ముందే ‘రాజుగాడు’ ప్రారంభమైంది. ఈ ఏడాదికి సంక్రాంతికి ‘రాజుగాడు’ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ ‘రంగులరాట్నం’ లైన్లో ఉండటంతో కుదర్లేదు. మంచి డేట్‌ చూసుకుని ఇప్పుడు రిలీజ్‌ చేస్తున్నాం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంది.

► ఈ చిత్రంలో క్లిప్టోమేనియా అనే డిజార్డర్‌ వల్ల తెలియకుండానే దొంగతనం చేసే హీరో క్యారెక్టర్‌ చేశాను. ఇలా డిజార్డర్‌తో బాధపడే హీరో ఊహించని పరిస్థితులను ఫేస్‌ చేసి ఎలా బయటపడ్డాడన్నదే చిత్రం కథ. సినిమా మొత్తం ఎంటర్‌టైనింగ్‌ పంథాలో సాగుతుంది.

► డైరెక్టర్‌ అంటే డైరెక్టరే. అందులో లేడీ అయితే ఏంటీ? జెంట్‌ అయితే ఏంటీ? ఎవరైనా ఎంత బాగా ఎగ్జిక్యూట్‌ చేస్తారన్నదే ముఖ్యం. డైరెక్షన్‌లో నేనూ ఇన్‌వాల్వ్‌ కాను. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. కానీ స్టోరీ డిస్కషన్స్‌లో మాత్రం పాల్గొంటాను.

► నేను హీరోగా నటిస్తున్న ‘లవర్‌’ సినిమా దాదాపు పూర్తయ్యింది. ఆ నెక్ట్స్‌ సూర్యప్రతాప్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే వశిష్ట అనే కొత్త అబ్బాయి దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్‌ అయ్యాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top