ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హీరో | ​ragha lawrence hospitalized with severe neck pain | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హీరో

Jan 21 2017 9:54 PM | Updated on Sep 5 2017 1:46 AM

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హీరో

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హీరో

ప్రముఖ తమిళ నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ అస్వస్థతకు గురయ్యారు.

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర మెడనొప్పితో బాధపడుతున్న ఆయన్ను శనివారం చెన్నైలోని పల్లవి హాస్పిటల్‌ చేర్చారు. జల్లికట్టుపై మెరీనా బీచ్‌లో జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న లారెన్స్‌ బీచ్‌ వద్దకు మెడకు గార్డు పెట్టుకుని వచ్చారు. అప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. జల్లికట్టు ఆందోళనలో పాల్గొన్నవారందరికీ లారెన్స్‌ కోటి రూపాయలు విలువ చేసే ఆహార పదార్థాలు, నిత్యవసర సరకులు అందించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement