
‘రేసు గుర్రం’కి బి. నాగిరెడ్డి పురస్కారం
విజయా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్నో కళాఖండాలు నిర్మించిన బి. నాగిరెడ్డి స్మారకంగా ప్రతి ఏటా ఓ సకుటుంబ
విజయా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్నో కళాఖండాలు నిర్మించిన బి. నాగిరెడ్డి స్మారకంగా ప్రతి ఏటా ఓ సకుటుంబ వినోదాత్మక చిత్రానికి జాతీయ పురస్కారం అందిస్తున్న విషయం తెలిసిందే. 2014కు సంబంధించి బి. నాగిరెడ్డి జాతీయ పురస్కారం ‘రేసుగుర్రం’ని వరించింది. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరిపే వేడుకలో కృష్ణ, విజయనిర్మల చేతుల మీదగా చిత్రనిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)కి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తామని నాగిరెడ్డి కుమారుల్లో ఒకరైన బి. వెంకట్రామిరెడ్డి చెప్పారు