ఒక్క ట్వీట్‌తో రూమర్లకు చెక్‌ పెట్టేశాడు!

A R Rahman tweet About Shankar And kamal Haasan Indian 2 Movie - Sakshi

శంకర్‌ సినిమా వస్తోందంటే.. ఆ చిత్రానికి సంగీత దర్శకుడెవరు అనే ప్రశ్నే రాదు. ఎందుకంటే శంకర్‌-రెహమాన్‌ కాంబినేషన్‌కు ఉండే క్రేజ్‌ అలాంటిది. శంకర్‌ మొదటి సినిమా జెంటిల్‌మెన్‌ నుంచి మొదలు రీసెంట్‌గా వచ్చిన ‘2.ఓ’ వరకు ప్రతీ సినిమాకు రెహమానే స్వరాలు సమకూర్చారు. అయితే ప్రస్తుతం యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌తో శంకర్‌ భారతీయుడు-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ మూవీకి అందరూ ఊహించినట్టు ఏఆర్‌ రెహమాన్‌ కాక.. అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు శంకర్‌. ఇక అప్పటినుంచి శంకర్‌, రెహమాన్‌లకు మధ్య గొడవలు జరిగాయని, ‘2.ఓ’  షూటింగ్‌ సమయంలో ఇద్దరికి మనస్పర్థలు వచ్చాయని అందుకే ఈ సినిమాకు రెహమాన్‌ను తీసుకోలేదని ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటన్నంటికి స్వర మాంత్రికుడు రెహమాన్‌ ఒక్క ట్వీట్‌తో చెక్‌ పెట్టేశాడు. మరో బ్లాక్‌ బస్టర్‌ చిత్రానికి సిద్దమవుతున్న నీకు, నీ బృందానికి గుడ్‌ లక్‌ అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో వీరిద్దరికి ఎలాంటి గొడవలు జరగలేదని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top