
పూరి నెక్ట్స్ సినిమా బాలయ్యతోనా..?
ఇజం సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్, తన నెక్ట్స్ సినిమాను ఎలాగైన ఓ స్టార్ హీరోతో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ లకు కథలు...
ఇజం సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్, తన నెక్ట్స్ సినిమాను ఎలాగైన ఓ స్టార్ హీరోతో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ లకు కథలు వినిపించినా.. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపించటం లేదు. దీంతో ఇతర హీరోల మీద దృష్టి పెట్టాడు. యంగ్ జనరేషన్ హీరోలతో సెట్ కాకపోతే సీనియర్ హీరోలతో అయినా సినిమా చేయాలని భావిస్తున్న పూరి క్రేజీ కాంబినేషన్ కు రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తన వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా పనుల్లో బిజీగా ఉన్న సీనియర్ హీరో బాలకృష్ణ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. వీలైనంత త్వరగా బాలయ్యకు కథ చెప్పి ఓకె చేయించుకోవాలని భావిస్తున్నాడు. అయితే గౌతమీ పుత్ర శాతకర్ణి తరువాత రైతు, ఆదిత్య 999, రామారావుగారు లాంటి సినిమాలకు కమిట్ అయిన బాలయ్య పూరి టైం ఎప్పుడు ఇస్తాడో చూడాలి.