మళ్లీ సక్సెస్ దండయాత్ర షురూ చేశా : సాయిరామ్ శంకర్

మళ్లీ సక్సెస్ దండయాత్ర షురూ చేశా : సాయిరామ్ శంకర్ - Sakshi


‘‘సాయిరామ్ శంకర్ చాలా మంచి వ్యక్తి. హిట్ కోసం ప్రయత్నిస్తూ, ఇలాగే ముందడుగు వేయాలి. ‘గడ్డం..’ సాంగ్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమాతో అతనికి మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను’’ అని హీరో నందమూరి కల్యాణ్ రామ్ అన్నారు.

 

 సాయిరామ్ శంకర్, నికిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, నక్కా రామేశ్వరి నిర్మించిన సినిమా ‘అరకు రోడ్‌లో...’. రాహుల్‌రాజ్, వాసుదేవ్ స్వరపరిచిన పాటల సీడీలను దర్శకుడు పూరి జగన్నాథ్, థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో కల్యాణ్‌రామ్ విడుదల చేశారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాలో అమ్మాయిలను చూస్తే హీరోకి నత్తి వస్తుంది. మహా భయస్థుడు. దర్శకుడు నా పాత్రను బాగా డిజైన్ చేశారు. మా టీమ్ అందరూ బాగా కష్టపడి చేశారు.

 

  సక్సెస్ కోసం సాయి దండయాత్ర చేస్తున్నాడని ఎవరో రాశారు. అలా చేయకపోతే తప్పే. ‘అరకు రోడ్‌లో’తో సక్సెస్ కోసం మళ్లీ దండయాత్ర షురూ చేశా. ఈసారి సక్సెస్ అవుతుందని ఆశిసున్నా’’ అన్నారు. హీరో సాయిరామ్ శంకర్ కుమార్తె జనన్య ఈ చిత్రంలో నటించారని నిర్మాత బాలసుబ్రమణ్యం తెలిపారు. ఈ వేడుకలో అమలాపురం ఎమ్మెల్యే ఆనంద్‌రావు, నటులు ఆకాశ్ పూరి, కమల్ కామరాజు, హీరోయిన్లు నికిషా పటేల్, సంజన, దీక్షాపంత్ పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top