‘నేనున్నాను’ గ్రంథం అందుకున్న సినీ తారలు

Puranapanda Srinivas Who Gave The Nenunnanu Book to Film Stars - Sakshi

ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు రచించి తెలుగు పాఠకుల ప్రశంసలు అందుకున్న రచయిత పురాణపండ శ్రీనివాస్ గారు శ్రీ హనుమంతుని లీలలను ఆవిష్కరిస్తూ మరో గ్రంథాన్ని పాఠకుల ముందుకు తీసుకువచ్చారు. నేనున్నాను పేరుతో మంత్రరూపకమైన ఉపాసనా విశేషాలతో పాటుగా అపురూపమైన శ్రీరామచంద్రుని కథతో హనుమాన్ దివ్య గుణాలను వ్యక్తపరిచేలా ఈ పుస్తకాన్ని అందిస్తున్నారు.  

ఇప్పటికే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రస్తుత ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు.. పూర్వపు ప్రధానార్చకులు రమణదీక్షితులు ఈ పుస్తకంపై ప్రశంసలు కురిపించారు.  ఈ పుస్తకాన్ని బయటకు తీసుకురావడంలో తమవంతు చేయూతను అందించిన వారాహి చలన చిత్రం అధినేతలు సాయి కొర్రపాటి, రజని కొర్రపాటిని కూడా వారు ఈ సందర్భంగా ప్రశంసించారు.

మరోవైపు కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ స్వామితో పాటుగా శృంగేరీ, కంచికామకోటి పీఠాధిపతులు కూడా ఈ గ్రంథ రచయిత పురాణపండ శ్రీనివాస్‌పై తమ వాత్సల్యాన్ని చూపించారు. పురాణపండ శ్రీనివాస్‌ నటులు ఎన్టీఆర్‌, బాలకృష్ణలతో పాటు దర్శకుడు రాజమౌళికి ఈ గ్రంథాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top