అన్ని అంశాలు ప్యాకేజ్‌తో ఉంటాయి –‘దిల్‌’రాజు | Producer Dil Raju Speech @ Krishnarjuna Yuddham Press Meet | Sakshi
Sakshi News home page

అన్ని అంశాలు ప్యాకేజ్‌తో ఉంటాయి –‘దిల్‌’రాజు

Apr 10 2018 1:09 AM | Updated on Apr 10 2018 1:09 AM

Producer Dil Raju Speech @ Krishnarjuna Yuddham Press Meet - Sakshi

సాహు గరికపాటి, మేర్లపాక గాంధీ, నాని, ‘దిల్‌’ రాజు, హరీష్‌ పెద్ది

‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ కథను మేర్లపాక గాంధీ ముందు నాకే చెప్పాడు. సింపుల్‌ కథ. సినిమా సూపర్‌హిట్‌ అయ్యింది. రెండో సినిమా ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ కూడా మంచి హిట్‌. తన సినిమాలో క్యారెక్టర్స్, కామెడీ, మ్యూజిక్‌.. ఇలా అన్ని అంశాలు ప్యాకేజ్‌తో ఉంటాయి’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సార్‌ మీర్‌ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను నేనే రిలీజ్‌ చేస్తున్నా.

గాంధీ సినిమాలతో ప్రేక్షకులకు పెద్దగా ఒత్తిడి ఉండదు. ఎంజాయ్‌ చేస్తారు. నేను రీసెంట్‌గా ఈ సినిమా చూశా. నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమా విడుదల టైమ్‌లో టెన్షన్‌ ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేస్తే టెన్షన్‌ అలవాటు పడిపోతుందని అనుకుంటే.. ప్రతి సినిమాకు కామన్‌గా వచ్చేస్తోంది. రెండు రోజుల ముందు సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేసే సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’’ అన్నారు. ‘‘ మా సినిమాను రాజుగారు విడుదల చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు మేర్లపాక గాంధీ. వెంకట్‌ బోయనపల్లి, సాహు గారపాటి, హరీష్‌ పెద్ది పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement