ప్రియాంకా చోప్రాకు ప్రతిష్ఠాత్మక అవార్డ్ | Priyanka Chopra to Receive Dadasaheb Phalke Film Foundation Award | Sakshi
Sakshi News home page

ప్రియాంకా చోప్రాకు ప్రతిష్ఠాత్మక అవార్డ్

Apr 10 2016 7:25 PM | Updated on Sep 3 2017 9:38 PM

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డు లభించింది.

ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డు లభించింది.  2011లో  విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన 'ఖూన్ మాఫ్' సినిమాలో్ అద్భుత నటనకు గాను ఈ అవార్డు వరించింది.

ఈనెల 24న ముంబైలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రియాంకకు అందజేయనున్నారు. ఆమెకు ఈ అవార్డు లభించడమిది రెండో సారి. ప్రియాంక ఇప్పటి వరకు 80కి పైగా సినిమాలు, టీవీ షోలు, అనేక డాక్యుమెంటరీ చిత్రాల్లో నటించింది. 'మేరీ కోమ్', 'బాజీరావ్ మస్తానీ' సినిమాలతో జోరుమీదున్న ప్రియాంక  ఇటీవల అమెరికాలో 'క్వాంటికో' టీవీ షో  ద్వారా హాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకుంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement