Sakshi News home page

సినిమా రివ్యూ: ప్రతినిధి

Published Fri, Apr 25 2014 3:42 PM

సినిమా రివ్యూ: ప్రతినిధి - Sakshi

నటీనటులు: నారా రోహిత్, విష్ణు, శుభ్ర అయ్యప్ప, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, గిరిబాబు, రంగనాథ్
 
సాంకేతిక వర్గం: 
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫి: చిట్టిబాబు
ఎడిటింగ్: నందమూరి హరి
దర్శకత్వం: ప్రశాంత్ మండవ
 
ప్లస్ పాయింట్స్: 
నారా రోహిత్ యాక్టింగ్
డైలాగ్స్
సెకాండాఫ్
 
మైనస్ పాయింట్స్: 
ఫస్టాఫ్
 
బాణం, సోలో చిత్రాలతో ఆకట్టుకున్న నారా రోహిత్ ఆతర్వాత టాలీవుడ్ రేసులో వెనకపడిపోయాడు. ఆతర్వాత వచ్చిన చిత్రాలల్ఓ అనుకున్నంత మేరకు ప్రభావం చూపలేకపోయారు. అతిధి పాత్రలో 'సారొచ్చారు', 'ఒక్కడినే' చిత్రాల తర్వాత నారా రోహిత్ కు టాలీవుడ్ లో పెద్ద గ్యాప్ వచ్చింది. టాలీవుడ్ లో సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్న నారా రోహిత్... పొలిటికల్ డ్రామాగా రూపొందిన 'ప్రతినిధి' చిత్రంతో 2004, ఏప్రిల్ 24 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో టీజర్ తో ఆకట్టుకున్న'ప్రతినిధి' చిత్రం ఎలాంటి టాక్ ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే. 
 
శ్రీను(నారా రోహిత్) ఓ జర్నలిస్ట్. కొన్ని పరిస్థితుల కారణంగా శ్రీను 'మంచోడు శ్రీను'గా మారి ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేస్తాడు. ముఖ్యమంత్రి విడుదలకు కొన్ని షరతుల్ని విధిస్తాడు. మంచోడు శ్రీను విధించిన షరతులను ప్రభుత్వం నెరవేర్చిందా? మంచోడు శ్రీను విధించిన షరతులెంటీ? అసలు జర్నలిస్ట్ శ్రీను ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడానికి కారణాలేంటి? జర్నలిస్ట్ శ్రీను ప్రతినిధిగా మారాడా అనే ప్రశ్నలకు సమాధానమే 'ప్రతినిధి' చిత్రం. 
 
ప్రస్తుత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించే శ్రీను పాత్రలో నారా రోహిత్ నటించారు. బాధ్యత కలిగిన పౌరుడిగా నటించిన నారా రోహిత్ కు మంచి మార్కులే పడ్డాయి. అయితే విపరీతంగా లావెక్కడంతో నారా రోహిత్ ను క్లోజప్ ష్టాట్స్ తోనే మేనేజ్ చేయాల్సి వచ్చింది. హీరో పాత్రలకు తగినట్టుగా నారా రోహిత్ తన శరీరాకృతిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందరూ సిక్స్ ప్యాక్ తో ఆలరిస్తుంటే నారా రోహిత్ మాత్రం అందుకు భిన్నంగా కనిపించాడు. 
 
హీరోయిన్ శుభ్ర అయ్యప్ప అంతగా గుర్తింపులేని పాత్రనే దక్కింది. హీరో ఫ్రెండ్ పాత్రలో వేణు పర్వాలేదనిపించారు. ఇక ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కోటా శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి పాత్రలు. పోలీస్ ఆఫీసర్ గా పోసాని కామెడితోపాటు, మంచి టైమింగ్ తో డైలాగ్స్ ను పేల్చారు. అయితే పోసాని డైలాగ్స్ లో ఎక్కువ శాతం బీప్ లతో విసిగెత్తించారు. కోట శ్రీనివాసరావును డైలాగ్స్ కే పరిమితం చేశారు. కోటాలోని నటుడిని పూర్తిగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు.
 
కీలక సన్నివేశాల్లో వచ్చే పాటలకు సాయి కార్తీక్ మంచి సంగీతాన్ని అందించారు. కొన్ని పాటలు ఆకట్టుకోలేకపోయాయి. ఈ చిత్రానికి కథ అందించిన ఆనంద్ రవి.. పవర్ పుల్ డైలాగ్స్ ను అందించారు. ప్రేక్షకులను ఆలోచించే విధంగా డైలాగ్స్ ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రతినిధి చితంతో ప్రశాంత్ మండవ మంచి ప్రయత్నమే చేశాడు కాని.. పక్కాగా కథను, కథనాన్ని అందించడంలో తడబాటుకు గురయ్యాడు. సెకండాఫ్ లో తన ఆలోచనలను ప్రేక్షకులకు చేరవేయడంలో తికమక పడ్డారనే చెప్పవచ్చు. పెట్రోల్ ధర, ఇతర ధరల విషయంలో ప్రేక్షకులను చైతన్యపరచడంలో దర్శకుడిగా కొంత మేరకు సఫలమయ్యారు. కథపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టి ఉంటే.. ప్రస్తుత వాతావరణానికి కనెక్ట్ అయ్యేది. తాను చెప్పాలనకున్న అంశాలపై క్లారిటీ మిస్ కావడం ప్రధాన లోపం. ప్రస్తుత రాజకీయ పార్టీలలో ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా ఉండే విధంగా సన్నివేశాలు రూపొందించడం, ముఖ్యమంత్రుల ఫోటోలలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఫోటోను చూపించకపోవడం వారి ఎజెండాను ప్రతినిధి చిత్రం ద్వారా స్పష్టంగా చెప్పారు. సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల కోసం కష్టంగా  ఓసారి చూడవచ్చు
 
ట్యాగ్: సాదాసీదా 'ప్రతినిధి'
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement