మేరా నామ్‌ ప్రభాస్‌! | Prabhas is learning Hindi | Sakshi
Sakshi News home page

మేరా నామ్‌ ప్రభాస్‌!

May 23 2017 12:09 AM | Updated on Sep 5 2017 11:44 AM

మేరా నామ్‌ ప్రభాస్‌!

మేరా నామ్‌ ప్రభాస్‌!

అంటే ‘నా పేరు ప్రభాస్‌’ (హిందీ టైటిల్‌ను తెలుగులోకి డబ్బింగ్‌ చేస్తే) అని అర్థం.

అంటే ‘నా పేరు ప్రభాస్‌’ (హిందీ టైటిల్‌ను తెలుగులోకి డబ్బింగ్‌ చేస్తే) అని అర్థం. ఇప్పుడు పరిచయాలెందుకు? ప్రభాస్‌ ఎవరో తెలుగుతో పాటు హిందీ జనాలకు తెలుసు కదా అంటారా? తెలుసు. కానీ, ‘బాహుబలి’ ప్రభాస్‌కే పెద్దగా హిందీ తెలీదు. తోడా తోడా... కొంచెం కొంచెమే వచ్చు. అందుకే, దేశభాషపై పూర్తిగా పట్టు సాధించాలనే సంకల్పంతో హిందీ నేర్చుకుంటున్నారట.

‘బాహుబలి’ హిందీ వెర్షన్‌కు ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ విలన్‌ శరద్‌ కేల్కర్‌ డబ్బింగ్‌ చెప్పారు. నెక్స్‌›్ట సినిమా (‘సాహో’)కు తానే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోవాలని ప్రభాస్‌ డిసైడ్‌ అయ్యారట. ఆయన హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘సాహో’ను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తీస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ జూలైలో ప్రారంభం కానుంది. ఈలోపే డైలాగులు అవలీలగా చెప్పేంతలా హిందీ ప్రాక్టీస్‌ చేయాలనేది ప్రభాస్‌ ప్లాన్‌. త్వరలో ఆయన హిందీ ట్యూటర్‌ను నియమించుకుంటారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement