నిర్మాతగా పవన్ కల్యాణ్ | power star Pawan Kalyan turned Film producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా పవన్ కల్యాణ్

Feb 28 2015 10:03 PM | Updated on Jul 6 2019 4:09 PM

నిర్మాతగా పవన్ కల్యాణ్ - Sakshi

నిర్మాతగా పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తనున్నారు.

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తనున్నారు. తన పెద్ద అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రాంచరణ్ హీరోగా త్వరలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. యువ నటులు, యువ దర్శకులలోని ప్రతిభను వెలికి తీసేందుకు చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించాలని పవన్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. అందులోభాగంగా పవన్ నిర్మాతగా మారబోతున్నారు. 

అందుకోసం ఇప్పటికే సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. అలాగే వరుసగా ప్రాంతీయ భాష చిత్రాలు చేసేందుకు పవన్ కల్యాణ్ సమాయత్తమవుతున్నట్లు సమాచారం. పవన్ దర్శకుడిగా ఇప్పటికే జానీ చిత్రాన్ని నిర్మాతగా పవన్ కల్యాణ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement