పడమటి కనుమల్లో... షూటింగ్ | Pawan Kalyan Gabbar Singh 2 Regular Shooting Started | Sakshi
Sakshi News home page

పడమటి కనుమల్లో... షూటింగ్

May 29 2015 10:54 PM | Updated on Mar 22 2019 5:33 PM

పడమటి కనుమల్లో... షూటింగ్ - Sakshi

పడమటి కనుమల్లో... షూటింగ్

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న పవన్ కొత్త సినిమా ‘గబ్బర్‌సింగ్ 2’ రెగ్యులర్ షూటింగ్ ఆరంభమైంది.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న పవన్ కొత్త సినిమా ‘గబ్బర్‌సింగ్ 2’ రెగ్యులర్ షూటింగ్ ఆరంభమైంది. పుణే సమీపంలో శుక్రవారం ఉదయం షూటింగ్ ప్రారంభించినట్లు నిర్మాత శరత్‌మరార్ ప్రకటించారు. రవితేజ ‘బలుపు’కు రచయితగా పనిచేసి, ‘పవర్’ ద్వారా దర్శకుడిగా పరిచయమైన యువకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) తన రెండో చిత్రంగా ‘గబ్బర్‌సింగ్ 2’కు మెగాఫోన్ పట్టారు.
 
 నిజానికి, చాలా రోజుల క్రితమే లాంఛనంగా ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు. ఆ తరువాత తుది స్క్రిప్టు ఖరారు చేయడంలో ఆలస్యమైంది. ఇన్నాళ్ళకు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంతో ‘‘యూనిట్ సభ్యులందరూ ఎగ్జైటెడ్‌గా, ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉన్నారు’’ అని శరత్ తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు. అయితే, పవన్ ఇంకా షూటింగ్‌లో పాల్గొనలేదనీ, త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారనీ ఆయన తెలిపారు. ‘‘దర్శకుడు బాబీ సారథ్యంలో పని మొదలైంది. మహారాష్ట్రలోని మాల్‌శేజ్ ఘాట్స్ (పుణేకు దాదాపు 130 కిలోమీటర్ల దూరం)లో తుపాకీలు, గూండాలు, గుర్రాల మధ్య షూటింగ్‌కు శ్రీకారం చుట్టాం’’ అని శరత్ మరార్ తెలిపారు.
 
 పడమటి కనుమల్లో భాగమైన ప్రసిద్ధ మాల్‌శేజ్ ఘాట్స్‌లో చుట్టూ అందమైన లోయలు, పచ్చటి చెట్లు, జంతుజాలం కనిపిస్తాయి. ‘గబ్బర్ సింగ్2’ అన్న స్క్రిప్ట్ పేరుకు తగ్గట్లుగా (సినిమా పేరు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది) చిత్రీకరణ అక్కడే ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఈ మధ్య గడ్డం పెంచిన పవన్ ఆ గెటప్‌లోనే కెమేరా ముందుకొస్తారా? చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement