సీతాకోక చిలుక షాపింగ్‌ చేసింది!

 Parul Yadav chills in France where she is shooting for the Kannada remake of Queen - Sakshi

‘బటర్‌ ఫ్లై’ అంటే ఏంటి? సీతాకోక చిలుక! ఎక్కడైనా సీతాకోక చిలుక గాల్లో ఎగురుతుంది కానీ... షాపింగ్‌ చేస్తుందా? చేయదు. మరి, చేసిందని చెబుతారేంటి? అనుకుంటున్నారా? ఇప్పుడు కన్నడలో ‘బటర్‌ ఫ్లై’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. హిందీ హిట్‌ ‘క్వీన్‌’కి రీమేక్‌ ఇది. హిందీలో కంగనా రనౌత్‌ చేసిన పాత్రను కన్నడలో పరుల్‌ యాదవ్‌ చేస్తున్నారు. అంటే... ఆమె సీతాకోక చిలుకే కదా! ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఫ్రాన్స్‌లో జరుగుతోంది.

చిత్రీకరణ మధ్యలో ఓ రోజు సెలవు ఇవ్వడంతో షాపింగ్‌ చేశానని పరుల్‌ తెలిపారు. ఇంతకీ, ఫ్రాన్స్‌లో షాపింగ్‌ ఎక్కడ చేశారో తెలుసా? తమన్నా సైట్‌ సీయింగ్‌కి వెళ్లారు కదా? మొనాకో... అక్కడే! షాపింగ్‌తో పాటు చుట్టుపక్కల అందమైన ప్రదేశాలు కూడా తిరిగొచ్చారట! అంతే కాదండోయ్‌... శనివారం పరుల్‌ అమ్మగారి బర్త్‌డే. ఆ సెలబ్రేషన్స్‌లోనూ ఫుల్లుగా సందడి చేశారు. ‘‘నా స్ట్రాంగ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ మా అమ్మే’’ అని పరుల్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియ చేశారు.

Back to Top