పక్కాగా ప్లాన్ చేశారు ! | Pakkaga plan Horror movie | Sakshi
Sakshi News home page

పక్కాగా ప్లాన్ చేశారు !

Jun 10 2016 10:56 PM | Updated on Sep 4 2017 2:10 AM

పక్కాగా ప్లాన్ చేశారు !

పక్కాగా ప్లాన్ చేశారు !

సుభాష్, నాగేష్, భవాని, యువరాణి ప్రధాన పాత్రల్లో రూపొందిన హారర్ చిత్రం ‘పక్కా ప్లానింగ్’.

సుభాష్, నాగేష్, భవాని, యువరాణి ప్రధాన పాత్రల్లో రూపొందిన హారర్ చిత్రం ‘పక్కా ప్లానింగ్’. బేబీ దివ్య సమర్పణలో ఏవీ ఫణీశ్వర్ (తుఫాన్) దర్శకత్వంలో నాగేష్ సీహెచ్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను నిర్మాతలు టి. ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో చాలా చిత్రాలొచ్చాయి. ఈ చిత్రకథాంశం వాటికి భిన్నంగా ఉంటుంది. ఇందులో నటీనటులంతా కొత్తవారే అయినా, అనుభవం ఉన్న వారిలా నటించారు.

నిర్మాత నాగేష్ పక్కా ప్రణాళిక, చిత్ర బృందం హార్డ్ వర్క్‌తో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయగలిగాం. ప్రేమ్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్’’ అని తెలిపారు. ‘‘త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత, హీరో నాగేష్ సీహెచ్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు ప్రేమ్ ఎల్‌ఎమ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement