సూపర్‌స్టార్‌ వెనక్కి వెళతాడా?

Padman to release on same weekend as 2.0. Will Rajinikanth film get postponed?

...లేదా వెళ్తున్నాడా? ముంబయ్, చెన్నైలలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌! సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘2.0’ను మొన్న వెళ్లిన దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. అయితే... భారీ ప్రొడక్షన్, గ్రాఫిక్‌ వర్క్‌ వల్ల వాయిదా వేసి వచ్చే జనవరి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీకి కూడా ‘2.0’ రావడం కష్టమేనంటున్నారు.

ఎందుకంటే... వచ్చే జనవరి 26న ‘2.0’లో విలన్‌గా నటించిన అక్షయ్‌కుమార్‌ హీరోగా చేసిన హిందీ సినిమా ‘ప్యాడ్‌మాన్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. జనవరి 25న ‘2.0’ వస్తే... అక్షయ్‌ తన సినిమాను ఎందుకు విడుదల చేస్తారు? ‘2.0’ వెనక్కి వెళ్తుందని అతనికి తెలిసింది కాబట్టే... ‘ప్యాడ్‌మాన్‌’ను రెడీ చేశారనేది ముంబయ్, చెన్నైలలో హాట్‌ టాపిక్‌. తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్‌ 13న) సందర్భంగా ‘2.0’ విడుదల చేయాలనుకుంటున్నారనేది తాజా సమాచారం. ఏమవుతుందో? ‘2.0’తో సూపర్‌స్టార్‌ వెనక్కి వెళతాడో? లేదో? చూద్దాం!!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top