ఎన్టీఆర్ క్యారెక్టర్పై క్లారిటీ | NTR Classical Dancer Role in jai lavakusa rumours Are Trash | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ క్యారెక్టర్పై క్లారిటీ

May 17 2017 10:45 AM | Updated on Sep 5 2017 11:22 AM

ఎన్టీఆర్ క్యారెక్టర్పై క్లారిటీ

ఎన్టీఆర్ క్యారెక్టర్పై క్లారిటీ

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా జై లవకుశ. తొలిసారిగా

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా జై లవకుశ. తొలిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాల ఫేం బాబీ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాపై ఆసక్తికరమైన వార్త ఒకటి కొద్ది రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రల్లో ఒకటి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర కాగా, మరో క్యారెక్టర్లో జూనియర్ ప్రభుత్వోద్యోగిగా కనిపించనున్నాడట. ఇక మూడో పాత్రలో ఎన్టీఆర్ క్లాసికల్ డ్యాన్సర్గా కనిపించనున్నాడన్న టాక్ వినిపించింది. అయితే ఈ రూమర్స్పై స్పందించిన చిత్రయూనిట్ ఎన్టీఆర్ పాత్రలపై క్లారిటీ ఇచ్చింది.

జూనియర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్న విషయం నిజమై అయినా ఇతర రెండు పాత్రలపై ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ నిజం కాదని తేల్చి చెప్పింది. దీంతో ఎన్టీఆర్ క్లాసికల్ డ్యాన్సింగ్ స్కిల్స్ చూడలనుకున్న అభిమానులు నిరాశపడుతున్నారు. అయితే మే 19న జై లవకుశ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఎలాంటి క్యారెక్టర్లలో కనిపించనున్నాడో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement