మరో నటుడిని ఊహించలేం | No one Replaced Vijay Antony In Annadurai :Srinivasan | Sakshi
Sakshi News home page

మరో నటుడిని ఊహించలేం

Nov 28 2017 9:38 AM | Updated on Nov 28 2017 9:38 AM

No one Replaced Vijay Antony In Annadurai :Srinivasan - Sakshi

సాక్షి సినిమా: అన్నాదురై చిత్రంలో కథానాయకుడిగా విజయ్‌ఆంటోనిని మినహా వేరొకరిని ఊహించలేమని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు శ్రీనివాసన్‌. విజయ్‌ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం అన్నాదురై. నటి రాధికాశరత్‌కుమార్‌ ఆర్‌.స్టూడియోస్, ఫాతిమా విజయ్‌ఆంటోని ఫిలిం కార్పోరేషన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అన్నాదురై. డయానాచంపిక, మహిమ హీరోయిన్లుగా నటించిన ఇందులో రాధారవి, కాళీవెంకట్, నళినికాంత్‌ ముఖ్యపాత్రలను పోషించారు. విజయ్‌అంటోని సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాసన్‌ మాట్లాడుతూ చాలా ఆసక్తిగా, కొంచెం అలజడిగానూ ఉందన్నారు.

ఇలాంటి అనుభూతి కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఒక దర్శకుడికి ప్రముఖ కథానాయకుడు, అనుభవజ్ఞులైన నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేంతిక వర్గం లభిస్తే ఆది చిత్రానికి బలం అవుతుందన్నారు.  ఇందులో విజయ్‌ఆంటోని పవర్‌ఫుల్‌ నటన అదనపు ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. తాను దర్శకుడు వసంతబాలన్‌ వద్ద క్లాస్, సుశీంద్రన్‌ వద్ద కమర్షియల్‌ను, భూపతిపాండియన్‌ వద్ద హ్యూమరస్, ఎళిల్‌ వద్ద ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని ఎలా పూర్తి చేయాలన్న విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. అన్నాదురై చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం గర్వంగా ఫీలౌతున్నానని శ్రీనివాసన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement