సోషల్‌మీడియా సెన్సేషన్‌కు.. తెలుగులో చాన్స్‌

Nitin Rakul Preet Singh And Priya Prakash Varrier Acting Together - Sakshi

ఓవర్‌నైట్‌లో వచ్చిన స్టార్‌డమ్‌ను ఎక్కువకాలం నిలుపుకోలేకపోయింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఒకే ఒక్క కనుగీటు, ముద్దుగన్నుతో కుర్ర హృదయాలను పేల్చిన ప్రియా వారియర్‌.. ‘లవర్స్‌ డే’ సినిమాతో చతికిల పడింది. ఈ సినిమా రిలీజైన తరువాత ప్రియా వారియర్‌కు గడ్డుకాలం మొదలైంది. ఈ మూవీలో తన లుక్స్‌, నటనకు నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. అప్పటివరకు ఆమెకు క్యూ కట్టిన ఆఫర్స్‌ అన్నీ ఆవిరయ్యాయి. 

లవర్స్‌ డే రిలీజైన తరువాత దాదాపు ఇండస్ట్రీకి దూరమైంది. అయితే తాజాగా తెలుగులో ఓ అవకాశాన్ని దక్కించుకుంది. నితిన్‌-చంద్రశేఖర్‌ యేలేటి చిత్రంలో ప్రియా వారియర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను చిత్రయూనిట్‌ నేడు నిర్వహించింది. భవ్య క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ నటిస్తుండగా.. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. నితిన్‌ ప్రస్తుతం ‘భీష్మ’ చిత్రంలో బిజీగా ఉన్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top