అమ్మాయి అపరకాళిగా మారితే... | Nisha Kothari in Criminals directed by Osho Tulasiram | Sakshi
Sakshi News home page

అమ్మాయి అపరకాళిగా మారితే...

Sep 7 2013 1:02 AM | Updated on Aug 11 2018 8:54 PM

అమ్మాయి అపరకాళిగా మారితే... - Sakshi

అమ్మాయి అపరకాళిగా మారితే...

నిషా కొఠారి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘క్రిమినల్స్’. మంత్ర, మంగళ ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వంలో... సీహెచ్‌వీ శర్మ నిర్మిస్తోన్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది.

 నిషా కొఠారి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘క్రిమినల్స్’. మంత్ర, మంగళ ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వంలో... సీహెచ్‌వీ శర్మ నిర్మిస్తోన్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి విజయకుమార్ కొండ కెమెరా స్విచాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించగా, చార్మి క్లాప్ ఇచ్చారు. 
 
 ‘‘సౌమ్యంగా ఉండే ఓ అమ్మాయి అపరకాళిగా మారితే ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు సమాధానంగా ఇందులో నిషా కొఠారి పాత్ర ఉంటుంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, డిసెంబర్‌లో సినిమా పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. ఓ వైపు సాఫ్ట్‌గా అనిపిస్తూ, మరో వైపు విభిన్న గెటప్పుల్లో కనిపిస్తానని నిషా కొఠారి తెలిపారు.
 
 మంత్ర, మంగళ చిత్రాల్లా ఇది కూడా సంచలనం సృష్టిస్తుందని సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. శక్తిమేర మంచి పాటలు ఇవ్వడానికి ప్రయత్నిస్తానని మంత్ర ఆనంద్ చెప్పారు. రాంజగన్, విజయసాయి, సతీష్, పూర్ణిమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: టి.జస్వంత్, కూర్పు: వినయ్‌రామ్, కళ: నాగేంద్రబాబు, నిర్మాణం: మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement