నేను... నా ఫ్రెండ్స్ | 'Nenu Naa Friends' movie shooting completed | Sakshi
Sakshi News home page

నేను... నా ఫ్రెండ్స్

Dec 22 2013 11:57 PM | Updated on Sep 2 2017 1:51 AM

రచయిత జీఎస్ రావు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నేను... నా ఫ్రెండ్స్’. సందీప్, సిద్దార్థ్‌వర్మ, హరీష్, రవి, అంజన, విష్ణుప్రియ,

 రచయిత జీఎస్ రావు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నేను... నా ఫ్రెండ్స్’. సందీప్, సిద్దార్థ్‌వర్మ, హరీష్, రవి, అంజన, విష్ణుప్రియ, హారిక, కృతిక, సంగీత ఇందులో హీరో హీరోయిన్లు. పరుచూరి గోపాలకృష్ణ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగు సినిమా క్రియేషన్స్ పతాకంపై గండెల హరిత సమర్పణలో వి.మధుసూదన్, సాయిమేథ రమణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఇది యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అని, సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేశామని, అతి త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: చిన్ని చరణ్, సహనిర్మాతలు: మోహన్‌రెడ్డి, చాగూరు రవి, సి.శ్రీనివాసరావు, కిశోర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement